ఏపిలో వ్యభిచారం చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తుంది.. విశాఖ, విజయవాడ,శ్రీకాకుళం జిల్లాల్లో ఈ వ్యభిచారం పడగ విప్పుతుంది. కానీ , ఇప్పుడు కొత్తగా గుంటూరు లో కూడా చీకటి దందాలు దర్శనమిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.సుప్రజ వివరాలు వెల్లడించారు. గుంటూరు ఏటీ అగ్రహారం జీరో (0) లైనులో నివాసం ఉండే షేక్ లాల్బీ అలియాస్ శ్రీలక్ష్మి, ఇంట్లోనే శ్రీలక్ష్మి మ్యాచింగ్ సెంటర్ పేరుతో చిన్నపాటి వస్త్ర దుకాణం నడుపుతోంది.