ఇటీవల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణాల విషయంలో గోల్ మాల్ అయినా సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు, ఓ కారు డ్రైవర్ ఇందులో కీలక పాత్ర పోషించినట్టుగా తేలింది. కారు డ్రైవర్ ప్రధాన సూత్రధారి కాగా, డబ్బుకు ఆశపడి బ్యాంక్ మేనేజర్లు అతను చెప్పినట్టు చేశారు. అయితే ప్రస్తుత మేనేజర్ ప్రేమానంద్.. కొన్ని రుణాలు చెల్లింపులపై అనుమానంతో రికార్డులను పరిశీలించగా అవి నకిలీ పాస్‌పుస్తకాలు అని తేలింది.