పాకిస్థాన్ లో ఓ హిందూ జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. పుచానో' అనే ఉర్దూ దినపత్రికలో అజయ్ లాల్వానీ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో అజయ్ లాల్వానీ అనే 31 ఏళ్ళ హిందూ జర్నలిస్టును దుండగులు కాల్చి చంపారు. ఈ రాష్ట్రంలోని సుక్కూర్ సిటీలో గల ఓ సెలూన్ లో హెయిర్ కట్ కోసం ఆయన కూర్చుని ఉండగా.. ఓ కారులోను, రెండు బైక్ ల పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు.