ఉత్తర ప్రదేశ్ లో దారుణం.. 52 ఏళ్ల రావత్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుతూరు రంజు ఇంటి సమీపంలో ఉండే రవి లోధి అనే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం నచ్చని రావత్.. రవితో రిలేషన్షిప్ కట్ చేసుకోవాలని కూతురితో చెప్పాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది..ఆ విషయం పై తండ్రి కూతుర్లు చాలా సార్లు గొడవ పడ్డారు.నిన్న ఉదయం రావత్ తన ఇంట్లో మృతిచెంది కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రంజును అదుపులోకి తీసుకుని విచారించగా.. రావత్‌ను తానే చంపినట్టు నేరం అంగీకరించింది.