భర్త వేధింపులు తాళలేక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. నంద్యాల పట్టణంలోని మాల్దార్పేటకు చెందిన మనీషా (20) ఇంటర్ వరకు చదివింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అయినా ఆ బాలికకు ఆ లోటు తెలియకుండా పెంచాడా మేనమామ. ఉన్నత చదువులు చదివించాడు. అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. పెళ్లి కూడా ఘనంగా చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 లక్షల రూపాయల కట్నం, 20 తులాల బంగారాన్ని వరుడికి కట్నంగా ఇచ్చాడు.