పశ్చిమ బెంగాల్ నుంచి కర్ణాటకకు ఉపాధి కోసం వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనికి కుదిరాడు. ఓ అద్దె ఇల్లు తీసుకుని అందులోనే ఉండేవాడు. కానీ.. ఓ మహిళ పరిచయం ఆ యువకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమెతో పెరిగిన పరిచయం చనువుగా మారి ఇద్దరూ కలిసి అదే అద్దె ఇంట్లో ఉండేంతలా పరిస్థితి మారింది. కొన్నాళ్లు ఇద్దరూ అదే ఇంట్లో ఉంటూ, తింటూ బాగానే ఉన్నారు. కానీ.. ఏమైందో తెలియదు ఆ యువకుడు నాలుగు రోజుల క్రితం అదే ఇంట్లో శవమై కనిపించాడు.