పవిత్రమైన పాఠశాలలను పానకాలశాలగా మార్చేశాడు. ద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాల్సిన ఉపాధ్యాయులు.. ఆ ఉపాధ్యాయులు క్రమశిక్షణ తప్పితే గాడిలో పెట్టాల్సిన మండల విద్యాధికారి కలిసి.. పాఠశాల ఆవరణనే బార్గా మార్చేశారు. విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పాల్సిన వ్యక్తి స్కూల్‌నే బార్గా మార్చేశాడు. విద్యార్థుల ముందే మందు కొడుతూ.. బిర్యానీ తింటూ.. ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు.