చికెన్ పకోడి తెచ్చిన వివాదం ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆ యువకుడి తలపై రాడ్డుతో కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి అక్కడికక్కడి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామానికి చెందిన శింగం యేసు పకోడి బండి నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.