నేటి సమాజంలో చాల మంది తొందరపాటు నిర్ణయాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలతో వందేళ్ల జీవితాన్ని విద్యార్థి దశలోనే ముగించేస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు కూడా బలవన్మరణానికి పాల్పడడం ఆవేదన పెంచుతోంది. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థిని.. క్షణిక ఆవేశంలో.. ఒత్తిడికి గురై జీవితాన్ని ముగించేసింది.