పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సిన భార్యాభర్తలు గొడవలతో వారి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. కష్టసుఖాల్లో ఒక్కరికి ఒక్కరు తోడుగా నిలవాల్సింది పోయి గొడవల కారణంగా వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలకే, వారి మధ్య తలెత్తే మనస్పర్థల కారణంగా చాల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి కుటుంబాలను విషాదంలోకి నెట్టేసి వెళ్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.