ఓ యువకుడు అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమె జీవితం, ఆమె సర్వస్వము అనుకున్నాడు. ఆమెతో జీవితం పంచుకోవాలని ఏన్నో కలలు కన్నాడు. కానీ ఇరు కుటుంబాల్లోనూ వీళ్ల ప్రేమ విషయం తెలిసి రచ్చ రచ్చ అయింది. ఊళ్లో పంచాయితీ కూడా పెట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆ అమ్మాయికి దూరంగా ఉండాలని పంచాయితీ పెద్దలు తీర్పునివ్వడంతో మనస్తాపం చెందాడు. తమ పెళ్లి ఇక జరగదేమోనన్న నిర్ణయానికి వచ్చేశాడు. తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.