కోపం ఎక్కువగా ఉంటె అనేక దారుణాలకు దారి తీస్తాది అనడానికి ఈ ఘటనే నిదర్శనం అనే చెప్పాలి. మనిషికి కోపం రావడం సహజం. అంతేకాదు. ప్రతీ వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో కోపం వస్తుంది. కానీ దానిని అదుపు చేయకపోతే చాలా అనర్థాలకు దారి తీస్తుంది. కుమారుడికి పాల పొడి విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ పెద్దదై ఆ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. క్షణికావేశంలో చేసిన ఓ పని నిండు గర్భిణితో ఉన్న తన భార్యను పోగొట్టుకోవాల్సి వచ్చింది.