వయస్సు పెరుగుతున్న కొద్దీ మనిషిలో మానవత్వం కనుమరుగైంది. అతను చేసేది ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరి ముందు మంచివాడిలా నటిస్తాడు. అలా మంచితనం మాటున ఓ అమ్మాయిని ట్రాప్ చేశాడు. చివరికి తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేధించాడు. అతని వేధింపుల కారణంగా యువతికి నిశ్చయమైన పెళ్లి క్యాన్సిల్ అవడమే కాకుండా.. యువతి తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని పరిగిలో చోటు చేసుకుంది.