హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలతో కొంత మంది వ్యక్తులు రేవ్ నిర్వహించారు. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేస్తూ చిందులు వేశారు. మందు చిందులతో హంగామా సృష్టించారు. పోలీసులు కూడా ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. నగరంలోని చాంద్రాయణగుట్టలో ఓ ఇంట్లో ఎంఐఎం కార్యకర్తలు రేవ్ పార్టీ నిర్వహించారు.