వాళ్లిద్దరూ ఒక్కరిని ఒక్కరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులు కాపురం సజావుగానే సాగింది. ఒక పాప పుట్టింది. పాప పుట్టిన కొన్నిరోజులకు ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. చీటికీమాటికీ గొడవపడుతుండేవారు. భర్తతో గొడవ పడి ఆ మహిళ పుట్టింటికి వెళ్లింది. చాలా నెలల నుంచి పుట్టింట్లోనే ఉంది. తిరిగి కాపురానికి తీసుకెళ్లేందుకు భర్త కూడా రాలేదు. అతను సొంతూళ్లోనూ లేడని తెలిసింది.