ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైయ్యాయి. అక్రమసంబంధాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటి కోణంలో మరో ఘటన మహబూబాబాద్ జిల్లా గార్లలో గురువారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గార్లలోని పుట్టకోట బజారుకు చెందిన గొడుగు ధనమ్మ భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె కుమారుడితో కలిసి ఉంటుంది.