భార్యతో ఏర్పడిన చిన్న చిన్న పొరపొచ్చాల వల్ల ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టిక్ టాక్ టోనీగా నెట్టింట ఫేమస్ అయిన ఆ కుర్రాడు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వాట్సప్ లో చివరి స్టేటస్ పెట్టి మరీ సెలవ్ అంటూ అందరికీ గుడ్ బై చెప్పాడు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది.