సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటూ సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారుణాలకు పాల్పడుతున్నారు. కుమార్తె తప్పిపోయిందనే బాధలో తండ్రి ఉంటే ఆమె జాడ కనుక్కోవాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఓ ఎస్సై. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పోలీసులు ఏ పనిచేయడానికైనా ఇలా లంచాలు ఇవ్వాలని జనాలను పీడిస్తున్నారు.