సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులను ఓ దుండగుడు హత్య చేశాడు. చిన్న పిల్లలను కూడా వదలిపెట్టలేదు. ఏ మాత్రం కనికరం లేకుండా రాక్షసుడిలా ప్రవర్తించాడు. విచక్షణారహితంగా అందరినీ నరికి చంపేశాడు. పెందుర్తి మండలం జుత్తాడలో ఈ దారుణం వెలుగుచూసింది.