విశాఖ పట్టణలోని మధురవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధురవాడలోని ఆదిత్య ఫార్చున్ టవర్లో ఫ్లాట్ నెంబర్ 505లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్లాట్ నుంచి భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు, మంటలు కనిపించడంతో మిగతా ఫ్లాట్స్ వారు భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.