సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. సొంతవారినే దారుణంగా హత్య చేస్తున్నారు. తాజాగా రూ.50 ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రిని కొడుకు కత్తితో దారుణంగా పొడిచి చంపిన ఘటన ఢిల్లీలోని భరత్ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరుద్యోగి కొడుకు అనిల్ ప్రతి నిత్యం డబ్బులు కావాలని 70 ఏళ్లు ఉన్న తన తండ్రి మహేంద్రపాల్పై ఒత్తిడి తీసుకువచ్చేవాడు.