ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. ఈ వైరస్ బారి నుండి ప్రజలను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ నిర్వహించింది. కానీ కర్ఫ్యూ ఓ యువతి నిండు ప్రాణం పోవడానికి పరోక్షంగా కారణమైంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉండగా ప్రజారవాణాకు అనుమతి లేదు.