తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. ఒక మహిళపై అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా గొంతు కోశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఆ తర్వాత ఆమె శవాన్ని బాంద్రా కుర్ల కాంప్లెక్స్ దగ్గర ఉన్న డ్రైనేజీ లో పడేశారు.నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ విషయంలో తేలిందేమిటంటే ,ఆమె వృత్తిరీత్యా వేశ్య అని, విటులకు ,ఆమెకు మధ్య డబ్బుల విషయంలోనే గొడవ జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తుల పై 376 అత్యాచారం , 302 హత్య సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.