సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండాపోయింది. క్షణికావేశంతో చిన్న చిన్న కారణాలకే ప్రాణాలను తీస్తున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తోడునీడగా ఉండాల్సిన కొడుకే వారిపై దాడికి పాల్పడ్డాడు. అనారోగ్యంతో బాధపడుతూ మంచంలో పడి ఉన్న తల్లిదండ్రులకు సేవలు అందించాల్సింది పోయి వారిపై ఓ కొడుకు కిరాతకానికి పాల్పడ్డాడు.