బంగారానికి ఎంత విలువ ఉంటుందో అందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఓ దంపతులు కొడుకు పేరు మీద బంగారాన్ని పంచి పెడుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం, వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామ సర్పంచ్ సురేంద్ర అతని భార్య పార్వతి తమకు రెండు పెద్ద పాత్రలలో బంగారు లభించిందని తన కుమారుడి పేరుపై 11 కేజీల బంగారాన్ని దానం చేయాలన్నారు.