మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరిపెడ మండలం, ధర్మారం శివారు, సీతారాంపుర తండాకు చెందిన మోడు ఉష ఇంటర్ సెకండియర్ చదువుతోంది. లాక్ డౌన్ కారణంగా కాలేజీలు బంద్ కావడంతో ఇంటి దగ్గరే ఉంటుంది. వారిది నిరుపేద కుటుంబం అయిన వారి తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేందుకు ఉపాధి హామీ పనికి వెళ్తోంది.