దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ బారినపడి వేలాది మరణాలు నమోదవుతున్నాయి. మరికొంత మంది ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో దేశంలో మరో బ్లాక్ ఫంగస్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది.