పాకిస్తాన్ సూపర్ లీగ్ పై బెట్టింగ్ లు వేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ...పాకిస్తాన్ లో జరిగే సూపర్ లీగ్స్ కు హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్ లు వేస్తున్నారని అన్నారు. ముఠా లో ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశాము, ప్రధాన నిందితుడు పరారీ లో ఉన్నారని తెలిపారు. ఈనెల 8 తేదీ నుండి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభమైందని అన్నారు. నిజాం పేట్ లో ఓ భవనం పై రైడ్ చేస్తే ఈ బెట్టింగ్ వ్యవహారం బయట పడిందని సజ్జన్నార్ తెలిపారు.