కొల్లం పల్లి జిల్లా పందలం గ్రామంలోని యువతి విస్మయ నాయర్ (28) ఈమె ఆయుర్వేదం డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతోంది. ఈమెలా చదువుతున్నప్పుడే అదే జిల్లాకు చెందిన శాస్త్రం కొట్టా ప్రాంతానికి చెందిన యువకుడు కిరణ్ తో మూడు నెలల కిందట వివాహమైంది. ఈ యువకుడు ఒక ప్రముఖ మోటార్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తుండడంతో.. ఇతనికి విస్మయ తల్లిదండ్రులు అధిక మొత్తంలో కట్నకానుకలు ఇచ్చారు. (టొయోటా కారు, పొలము మరియు లక్షల్లో డబ్బు ఇచ్చారు.) అధిక కట్నం తేవాలని విస్మయ ను కిరణ్ అతని తల్లిదండ్రులు హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారు.