సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారంగా....సీసీఎస్, పెనమలూరు పోలీసులు ఐదుగురు నేరస్తులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితులు ఆటో డ్రైవర్లు, పెయింటర్లు గా పని చేస్తారని... ఒకరు కూరగాయల వ్యాపారం చేస్తారని తెలిపారు. ఈ బ్యాచ్ అంతా పోరంకి, పెనమలూరులో ఉంటారని సీపీ వెల్లడించారు. సుంకర గోపీరాజు, ప్రభుకుమార్ కలిసి ఈ నేరాలకు ప్లాన్ లు వేసేవారని తెలిపారు. ఈ గ్యాంగ్ మొదటి నేరాన్ని పెనమలూరులో చేసిందని అన్నారు.