టాలీవుడ్ లో నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. 2017 లో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు డ్రగ్స్ కేసులో దూకుడుగా వ్యవహరించారు. 2017 జులై 2న ఎక్సైజ్ పోలీసు అధికారులు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. టాలీవుడ్ లోని పలువురు నటీనటులు, దర్శకులు, కెమెరామెన్ లను సైతం విచారించారు. అంతే కాకుండా ఈ కేసులో అకున్ సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. రోజుల తరబడి టాలీవుడ్ కు చెందిన పలువురిని విచారించారు. అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఓ నటిని పిలిపించి మరీ విచారించారు. అంతే కాకుండా ఓ టాప్ డైరెక్టర్ ను, టాప్ హీరోను సైతం విచారించారు. అప్పుడు సెలబ్రిటీలతో పాటు ఇతరులు మొత్తం 70 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి.