ప్రస్తుతం పెళ్ళీడు వచ్చినా పెళ్లిళ్లు జరగడం లేదని ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. పెళ్లి వయసు వచ్చినా ఉద్యోగం లేదని, అందంగా లేరని, పెళ్ళి వయస్సు దాటి పోయిందని ఇలా రక రకాల కారణాల వల్ల పెళ్లిళ్లు జరగటం లేదు. దాంతో చాలామంది నిరుత్సాహ పడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం పెళ్లి వయసు వచ్చి పెళ్ళిళ్ళు జరగడం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పురుషులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే తాజాగా ఓ మహిళా ఎస్సై తనకు పెళ్ళి జరగడం లేదని ఆత్మహత్య చేసుకుంది.