తాజాగా ఆదివారం ఒక్కరోజే పిడుగు పాటుకు ఏకంగా 68 మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన వేరు వేరు పిడుగులు పడిన సంఘటనల్లో వీరు మృతి చెందారు. కాగా ఉత్తరప్రదేశ్ లో అధికంగా పిడుగు దాడికి 41 మంది మృతి చెందారు. అంతే కాకుండా రాజస్థాన్ రాష్ట్రంలో 11 మంది పిడుగుల దాడికి మరణించారు.