దేశంలో డ్రగ్స్ వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎంతో మంది యువత డ్రగ్స్ కు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య హై స్కూల్ లలో సైతం విద్యార్థులు డ్రగ్స్ వాడుతుండటం సంచలనం రేపుతోంది. కాగా డ్రగ్స్ కు చెక్ పెట్టేందుకు అస్సాం ప్రభుత్వం నడుంబిగించింది. రెండు నెలల్లో పోలీసులు సుమారు 163 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇలా స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేతుల మీదగా పోలీసులు ధ్వంసం చేయించారు. మూడు నెలలుగా రాష్ట్రంలో పోలీసులు 163 కోట్ల విలువైన డ్రగ్స్ ను ముఠాల నుండి స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిని శని ఆది వారాల్లో దింపు, గోలాఘాట్, బర్హంపూర్ ప్రాంతాల్లో ధ్వంసం చేశారు.