కేరళ కు చెందిన ట్రాన్స్ జెండర్ లింగ మార్పిడి కోసం ఆరు సర్జరీలు చేసుకోగా అవి వికటించడంతో ఆత్మహత్య చేసుకుంది. ట్రాన్స్ జెండర్ అనన్య కుమారి అలెక్స్ కేరళ లోనే తొలి ట్రాన్స్ జెండర్ రేడియో జాకీగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన మొదటి ట్రాన్స్ జెండర్ గా కూడా అనన్య ఎంతో పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా మంగళవారం కేరళలోని తన నివాసంలో అనన్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇంకా ఆమె మృతికి గల కారణాలు తెలియదు. కానీ అనన్య కుమారి గత ఏడాది కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతుందని చెబుతున్నారు. గత సంవత్సరం జూన్ నెలలో అనన్య లింగ మార్పిడికోసం ఆరు సర్జరీలు చేసుకున్నారు.