ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జల విలయంలో చిక్కుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల తో మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీం జిల్లాలలో భారీగా వరద నీరు చేరింది. ఈ వర్షాలతో జిల్లా లోని లోతట్టు ప్రాంతాలన్ని పూర్తిగా జలమయమయ్యాయి. దాంతో అప్రమత్తమైన స్థానిక అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. దాంతో స్థానికంగా ఉన్న రామ్ నగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీలలోని ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దాంతో స్థానిక ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.