పసిబిడ్డను రైలు పట్టాలపై వదిలి వెళ్లిపోయారు. అయితే ఈ పాపం తల్లిదండ్రుదా లేదా మరి ఎవరైనా పగతో చేసి ఉంటారా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. అంతే కాకుండా ప్రాణాలు ఉండగానే బిడ్డను వదిలి వెళ్లారా..? లేదంటే చనిపోయిన తరవాత వదిలి వెళ్లారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే... విజయనగరంలో రెండు నెలల పసికందు మృతదేహం రైలు పట్టాలపై లభ్యమైంది. జిఆర్పి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంట కాపల్లి మరియు కొత్త వలస రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై రెండు నెలల పసికందు మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఆదివారం గుర్తించారు. రెండు పట్టాల మధ్యలో ఒక టవల్ చుట్టి ఆ పసికందు మృతదేహం కనిపిస్తోంది. ఆ బిడ్డ శరీరంపై లేత నీలం రంగు టీ షర్ట్ ధరించి ఉండగా చుట్టూ ఒక టవల్ కప్పి ఉంది.