ఓ మాజీ మంత్రి ఏకంగా ఆరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అంతా సాఫీగా జరుగుతుందనుకునే సమయానికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ మాజీ మంత్రి మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పెళ్లిని అడ్డుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో వెలుగు చూసింది.