సాధారణంగా తల్లిని మించిన దైవం లేదు. బిడ్డలకు ఎలాంటి సమస్య వచ్చినా తల్లి తల్లడిల్లిపోతుంది. కానీ తమిళనాడులో ఓ తల్లి బిడ్డను చిత్ర హింసలు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన కొడుకును కొడుతూ తల్లి ఆ వీడియోలను తన భర్తకు పంపించింది. తల్లి తన కొడుకు ప్రదీప్ ను కొడుతూ 250 వీడియోలను చిత్రించిందంటే ఆ తల్లి ఎలాంటి రాక్షస మనస్తత్వం కలిగిందో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే....తమిళ నాడు విల్లిపురం జిల్లాలోని సత్యమంగళం మెట్టూరు గ్రామానికి చెందిన తులసి అనే మహిళ తన రెండేళ్ల బిడ్డపై కర్కషంగా వ్యవహరించింది. తన కొడుకు ప్రదీప్ ను రకరకాలుగా కొట్టి చిత్రహింసలు పెట్టింది.