పోలీసులు నింధితుడు రాజు స్నేహితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా....ఘటన జరిగిన రోజు సాయంత్రం ఎల్బి నగర్ వద్ద మరో స్నేహితుడితో మద్యం నిందితుడు రాజు మద్యం తాగినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు మద్యం తాగిన వీడియోలు ఎల్బినగర్ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇక రాజు స్నేహితుడు రాజు చేసిన నేరం తెలీదని చెప్పిన పోలీసుల విచారణలో చెప్పాడు. మద్యం సేవించిన తరువాత రాజు ఎటు పోయాడో తనకు తెలియదని చెబుతున్నాడు. ఇక గతంలో రాజు పై ఒక బైక్ దొంగ తనం కేసు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా రాజు ప్రవర్తన నచ్చక పోవడంతో అతడి భార్య కూడా వదిలి వెళ్లిపోయినట్టు పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది. ఇక నల్గొండ జిల్లాలో ఉన్న రాజు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.