దేశంలో మహిళలపై దారుణాలకు బ్రేక్ పడటం లేదు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రూపంలో మహిళలు మానవమృగాళ్ల చేతుల్లో చితికిపోతూనే ఉన్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ కీచకుడు వ్యభిచారం చేయాలంటూ వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపుతోంది. తనను వదిలిపెట్టాలంటూ ప్రాదేయపడినా విడిచిపెట్టకుండా దుర్మార్గుడు రక్తం వచ్చేలా యువతిపై దాడి చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. అయితే యువతిపై దాడి జరిగి మూడు నెలలు అవుతుండా దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.