సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి పై హత్యాచారం చేసిన నింధితుడు రాజు అత్మహత్య చేసున్నాడు అనే వార్త తెలియడంతో సింగరేణి కాలనీ సంబురాలు జరుపుకుంటున్నారు. చిన్నారిని దారుణంగా అత్యాచారం చేసి చంపిన ఆ మానవ మృగం ఇక లేదని కాలనీ వాసులంతా కలిసి టపాసులు పేల్చుకుంటూ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే నింధితుడి డెడ్ బాడీని పాప తల్లి దండ్రులకు చూపిస్తే వారు ఇంకా ఆనందిస్తారని కాలనీ వాసులు చెబుతున్నారు. మరోవైపు పాప తండ్రి కూడా ఆ హంతకుడి బాడీ సింగరేణి కాలనీకి తీసుకురావాలని కోరిన సంగతి తెలిసిందే. ఇక హంతకుడిని పట్టుకోవడగాని పోలీసులు ఇన్ని రోజులు చేస్తున్నారని మొదట తాము బాధపడ్డామని కాలనీవాసులు చెబుతున్నారు.