తండ్రి చేసిన పనికి ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. పిల్లలకు మంచి చెడ్డలు నేర్పించాల్సిన తండ్రే బాధ్యత లేకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది కూడా కూతుళ్ల పెళ్లిళ్లు జరిగి కొడుకు పెళ్లీడుకు వచ్చిన వయసలో..దాంతో ఆ కుంటుబంలో తరచూ గొడవలు జరగటం ప్రశాంతత లేకపోవడంతో అతడి భార్య ఇద్దరు కూతుళ్లు కొడుకు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన బెంగుళూరులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే....బెంగుళూరులో శుక్రవారం శంకర్ అనే వ్యక్తి భార్య ఆయన ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకునే ముందు కుమారుడు మధుసాగర్ తన లాప్ టాప్ లో తమ ఆత్మహత్యకు తండ్రి అక్రమ సంబంధమే కారణమని పేర్కొనడం సంచలనం గా మారింది.