మహారాష్ట్ర నాగపూర్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నాగపూర్ జిల్లాలో క్యాన్సర్ తో బాధపడుతున్న తన తల్లిని రక్షించుకునేందుకు చికిత్సకు అవసరమైన డబ్బుల కోసం ఓ 11 ఏళ్ల బాలిక వ్యభిచారం చేసేందుకు సిద్ధమైంది. పక్కా సమాచారంతో బాలికను అదుపులోకి తీసుకుని పోలీసులు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఓ అపార్ట్ మెంట్ లో బాలిక తో పాటు మరో ముగ్గురు మహిళలను పోలీసులు గుర్తించారు. ఆ ముగ్గురు మహిళలు బాలిక కోసం కస్టమర్ ను తీసుకువచ్చారు. అంతేకాకుండా కస్టమర్ తో 40000 ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆ కస్టమర్ ఓ ఎన్జీఓకు చెందిన వ్యక్తి కాగా అతడే పోలీసులకు సమాచారం ఇచ్చి బాలికను రక్షించాడు.