తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ సాయికుమార్ కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు. ఇతడు గత 12ఏళ్లలో దాదాపు రూ.200 కోట్లు కొల్లగొట్టినట్లు సీసీఎస్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈయన కొట్టేసిన డబ్బు ఎవరిదంటే.. ఏపీ హౌజింగ్ బోర్డులో రూ.40 కోట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రూ.15 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖలో రూ.45 కోట్లు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్లకు సంబంధించిన రూ.15 కోట్ల డిపాజిట్లను సాయి దారి మళ్లించాడట. డబ్బును తెలుగు అకాడమీకి చెందిన రూ. 64.5 కోట్లను ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి.. ఆ తర్వాత నిందితులు వాటాలు వేసుకున్నట్టు తెలుస్తోంది.