బట్టలు ఆరేస్తూ చనిపోయిన భార్య భర్తలు.. ఏం జరిగిందంటే?

praveen
రేపు బాగుంటుంది అనే ఆశతోనే ప్రతి ఒక్కరూ ప్రతిక్షణం జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందొ అన్నది మాత్రం ఎవరు ఊహకందని విధంగానే ఉంటుంది. అందుకే మనుషుల జీవితాలు దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటివి అని చెబుతూ ఉంటారు ఎంతో మంది. ఇక కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో విధి చిన్న చూపు చూసి చివరికి ప్రాణాలను తీసేస్తూ ఉంటుంది. ఇలా విధి ఆడిన వింత నాటకంలో బలిపశువులుగా మారిన మనుషులు ప్రాణాలు కోల్పోతూ ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటారు.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరూ అంటే ఒకరికి ప్రాణం. ఈ క్రమంలోనే ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన దాంట్లో సర్దుకుపోతూ ఒక జీవితంలో ఎంతో సంతోషంగానే ఉన్నారు ఆ భార్యాభర్తలు. కానీ వారి సంతోషాన్ని చూసి ఓర్వ లేక పోయింది. ఇక ఆ దంపతులు ఇద్దరిని మృత్యు రూపంలో కబళించాలని అనుకుంది. ఈ క్రమంలోనే  అనుకోని ఘటన ఆ దంపతులు ఇద్దరిని కూడా కానరాని లోకాలకు తీసుకు వెళ్ళింది. ఈ విషాదకర ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో వెలుగులోకి వచ్చింది  బట్టలు ఆరెస్తూ ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదఛాయలు అలుముకునేల చేసింది.

 సర్వీస్ వైర్ పై దుస్తులు ఆరేస్తుండగా దంపతులు మృతి చెందారు. అయితే ముందుగా భార్య కు కరెంట్ షాక్ తగిలగా ఇక భార్య ను కాపాడే క్రమంలో భర్త కూడా విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ ఘటన అరకులోయ లోని విద్యుత్ ఉద్యోగుల క్వార్టర్స్ లో జరిగింది. అయితే విద్యుదాఘాతంతో ముందుగా దంపతులు ఇద్దరు స్పృహ కోల్పోయారు. వెంటనే గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ కి కాల్ చేశారు. కానీ అంబులెన్స్ రాక కాస్త లేట్ కావడంతో భార్యాభర్తల మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కాస్తా సంచలనంగా మారిపోయింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: