అందంగా లేవన్న భర్త.. భార్య చేసిన పనికి అందరు షాక్?

praveen
పెళ్లి విషయంలో ప్రతి ఆడపిల్ల కోటి ఆశలు పెట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత మెట్టినింట అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశ పడుతూ ఉంటుంది. మెట్టినింట్లో ఉండే అత్తమామలను తల్లితండ్రులుగా భావించి సేవ చేయాలని అనుకుంటూ ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో ఇలా కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెడుతున్న ఆడపిల్లలకు అనుక్షణం వేధింపుల ఎదురవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని చోట్ల అత్తమామలు వేధిస్తూ ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం  కట్టుకున్న భర్త వేధిస్తున్న పరిస్థితి.

 ఇలా ఇటీవలి కాలంలో వేధింపులు తట్టుకోలేక ఎంతోమంది వివాహితలు ఆత్మహత్య చేసుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నా ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కంటికి రెప్పలా కాచుకుంటాడు అనుకున్న కట్టుకున్న భర్త చివరికి ఆమె పాలిట యమకింకరుడిగా మారిపోయాడు. సూటిపోటి మాటలతో వేధింపులకు పాల్పడేవాడూ. చివరికి భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

 మహబూబ్ నగర్ జిల్లా నెల్లి కొండ కు చెందిన మాధురికి నారాయణపేట జిల్లా పెద్ద జట్రం కు చెందిన సతీష్ కుమార్ రెడ్డితో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. మాధురి బీఈడీ చదువు పూర్తి చేయగా.. సతీష్ రెడ్డి మార్కెటింగ్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు.  ఉద్యోగాన్ని నగరంలోని ఓ బ్యాంకు శాఖకు మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల బీఎన్రెడ్డి నగర్ లోని వెంకటేశ్వర కాలనీ లో అద్దెకు ఉంటున్నారూ ఈ దంపతులు. కొన్నాళ్ళ వరకు వీరి సంసారం ఎంతో సాఫీగా సాగిపోయింది. కానీ ఆ తర్వాత అందంగా లేవు అని బెదిరించడం మొదలుపెట్టాడు. పెళ్లి సమయంలో కోరిన కట్న కానుకలను ఇచ్చిన సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉండేవాడు. ఇక భర్త వేధింపులు రోజురోజుకి ఎక్కువవడంతో చివరికి ఆత్మహత్యకు పాల్పడింది మాధురి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: