ఇటీవల కాలంలో సభ్య సమాజంలో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత అటు మనుషుల మధ్య మానవ బంధాలకు విలువ లేకుండా పోయింది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు పరాయి వ్యక్తులు ఎటు పోయిన.. ఏమైపోయిన పర్వాలేదు. కానీ నా వాళ్ళు నేను సంతోషంగా ఉన్నామా లేమా అని స్వార్ధంగా ఆలోచించేవాడు మనిషి. కానీ ఇప్పుడు నా వాళ్ళు అనే ఆలోచన కూడా పోయి నేను అనే స్వార్థం పెరిగిపోయింది మనుషుల్లో. ఈ క్రమంలోనే ఏకంగా సొంత వాళ్ళ విషయంలో కూడా దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి .


అయితే ఎన్ని బంధాలు మారినా.. అటు తల్లిదండ్రుల ప్రేమ మాత్రం మారదు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే రక్తం పంచుకుని పుట్టిన పిల్లలను ఎప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాచుకుంటారు. ఏ సమస్య రాకుండా ఎప్పుడు వెన్నంటే  ఉంటారు. అందుకే తల్లిదండ్రి మొదటి దైవం అని చెబుతూ ఉంటారు పెద్దలు. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే మాత్రం తల్లిదండ్రుల ప్రేమలో కూడా కల్తీ అయిపోయిందేమో అని భావన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే రక్తం పంచుకొని పుట్టిన కొడుకు విషయంలో ఆ తల్లిదండ్రులు కాస్తయినా మానవత్వంతో ఆలోచించలేకపోయారు. ఏకంగా ఐఫోన్ మోజులో 8 నెలల కొడుకుని అమ్మేందుకు కూడా సిద్ధమయ్యారు.


 ఈ దారుణమైన ఘటన పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఐఫోన్ కొని ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేయాలి అని అనుకున్నారు ఆ దంపతులు. ఐఫోన్ కొనేందుకు మాత్రం డబ్బులు లేవు. దీంతో నీచమైన ఆలోచన చేశారు. ఏకంగా తమ ఎనిమిది నెలల కొడుకుని విక్రయించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో బాలుడు తల్లి సతిని కొనుగోలు చేసిన ప్రియాంక ఘోష్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇలా 8 నెలల బాలుడు విక్రయంలో కీలకపాత్ర వహించిన తండ్రి పరారిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: