భారత్ సరిహద్దుల్లో చైనా ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో ఎవరికీ అంతు చిక్కదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దానిని ఎదుర్కొనేందుకు భారత సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో అధునాతన ఆయుధాలను మోహరిస్తోంది. ఇందులో భాగంగా భారత సైన్యానికి కొత్తగా 400 ఫిరంగి తుపాకుల కొనుగోలుకు కేంద్ర రక్షణ శాఖ టెండర్లను పిలిచింది. మేకిన్ ఇండియాలో భాగంగా దేశీయంగా ఆర్టిలరీ గన్స్ ను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఆధునికీకరణ  ప్రణాళికలో భాగంగా రూ.6500 కోట్లు వెచ్చించి 307 అధునాతన ఆర్టిలరీ గన్ సిస్టమ్ ను కొనుగోలు చేయడానికి టెండర్ జారీ చేసింది.


ఈ విషయంలో భారత్ చాలా వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. ఎప్పుడూ రక్షణ పరికరాల కోసం విదేశాలపై ఆధారపడే భారత్ ఈ సారి దేశీయ పరిజ్ఞానాన్ని నమ్ముకుంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చైనాతో పాటు అమెరికా భావిస్తోంది. భారత్ ఎదుగుదలను చూసి మనకు తోడు ఉండాలని అమెరికా చూస్తోంది.  ఎందుకంటే అమెరికా ప్రజల దృష్టిలో చైనాను దెబ్బకొట్టాలి కాబట్టి. దీనికి మొక్కుబడిగా పలు ఆంక్షలను విధించారు. ట్రంప్ సమయంలో అమెరికా నుంచి బయటకు వచ్చేందుకు పలు కంపెనీలు సిద్ధపడ్డాయి. ఆ సమయంలో జపాన్ మాత్రమే వెనక్కి వచ్చింది.  మిగతా యూరప్ దేశాల కంపెనీలు ఇంకా 90 శాతం అమెరికాలోనే ఉన్నాయి.  


మోదీ మళ్లీ గద్దెను ఎక్కితే ప్రపంచంలో భారత్ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.  కాబట్టి ఎన్నికల ముందు చైనా యుద్ధ వాతావరణం సృష్టించి 1962లో నెహ్రూని దెబ్బకొట్టిన విధంగా చేస్తే బీజేపీ ని ఎదగనీయకుండా చేయవచ్చు అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి తెరవెనుక అమెరికా కూడా సహకరిస్తోంది అనే వాదన ఉంది.  దీనికి ప్రతిగా చైనా సరిహద్దుల్లో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 400 ఆర్టిళరీ గన్స్ ను ఇండియా మోహరించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: