తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఇటీవల అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా మాజీ మంత్రులంతా ఆ కార్యక్రమానికి వెళ్లారు. అయితే అప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, తిరుపతి ఉప ఎన్నికలకోసం లోకేష్ తోపాటు ఇతర నాయకులతో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీలో కీలక సభ్యుడు లోకేష్ మాత్రం నామినేషన్ ఘట్టానికి డుమ్మా కొట్టారు. అంతే కాదు, ఇప్పటి వరకు తిరుపతి ఊసే లోకేష్ అనుకోవట్లేదు. తిరుపతి ప్రచారానికి లోకేష్ దూరంగా ఉంటున్నారు.